బైక్‌పై వెళ్తున్న వ్యక్తి‌ని లిఫ్ట్ అడిగిన ఇద్దరు మహిళలు అతని మెడలోని బంగారాన్నే కాజేసేందుకు యత్నించి, కటకటాలపాలయ్యారు. కలకలం రేపుతున్న ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

కీసర మండలం నాగారం సత్యనారాయణ కాలనీకి చెందిన రవిశంకర్ ‌(30) యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజులానే బుధవారం రాత్రి విధులు ముగించుకున్న సత్యనారాయణ BBనగర్ నుంచి నాగారంకు బైక్ పై బయలుదేరాడు. ఘట్‌కేసర్ HPCL వద్దకు రాగానే ఇద్దరు మహిళలు లిఫ్ట్ అడిగారు. దీంతో రవిశంకర్ వారిని బైక్‌పై ఎక్కించుకున్నారు. ఘట్‌కేసర్ ఘట్టు మైసమ్మ ఆలయం వద్దకు రాగానే ఆయన మెడలోని రెండు తులాల బంగారు గొలుసును మహిళలు చోరీ చేశారు. అది గమనించిన రవిశంకర్ బైకు ఆపీ మహిళలిద్దరినీ నిలదీశాడు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళలను అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు..,