Advertisement

రామప్ప దేవాలయం ఎంతో గొప్ప కట్టడమని యునెస్కో ప్రతినిధి వాసు పోశ్యానందన అన్నారు. వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లాలో యునెస్కో ప్రతినిధుల బృందం రెండు రోజుల పర్యటన గురువారం ముగిసింది. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు విషయంలో మేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తయ్యింది. ఈ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చే నివేదిక ఆధారంగానే యునెస్కో గుర్తింపు వస్తోంది. రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తికావడానికి ఐదారు నెలల టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడుతోంది. గురువారం ఉదయ 10.30 గంటలకు రామప్ప వచ్చిన వాసు పోశ్యానందన మధ్యాహ్నం 3 గంటల వరకు రామప్ప అనుబంధ దేవాలయాలను, రామప్ప సరస్సు, కాలువలు, రోడ్డు మార్గం పరిశీలించారు.

సరస్సులో బోటు షికారు చేశారు. పాలంపేట గ్రామస్తులతో చాలా సేపు ముచ్చటించారు. రామప్ప దేవాలయానికి ఈ సారి ఎలాగైనా యునెస్కో గుర్తింపు వస్తుందని ఇంటాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండు రంగారావు ఆశాభావం వ్యక్తం చేశారు. పోశ్యనందన రెండు రోజుల పర్యటనలో పాండు రంగారావు ఆయన వెంటే ఉన్నారు. పోశ్యానందన రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్జర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెస్టోరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంశాలపై మంచి ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని తెలిపారు. రామప్ప దేవాలయం, వెయ్యి స్తంభాల గుడి రెండు కూడా రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టడాలే కావడం మనకు కలిసివచ్చే అంశమన్నారు.

అలాగే రామప్ప కట్టడాలు, శిల్పాలపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తే యునెస్కో ప్రతినిథిగా రావడం వల్ల ఈసారి తప్పకుండా యునెస్కో గుర్తింపు వస్తుందని వివరించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సి.నారాయణరెడ్డి, వరల్డ్ హెరిటేజ్ సూపరిడెంట్ మిలన్ కుమార్ చౌలె, బీవీ పాపారావు, హెరిటేజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ దినకర్ బాబు, టూరిజం జిల్లా అధికారి శివాజీ, కన్జర్వేషన్ అసిస్టెంట్ మల్లేశం , జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement