(రామప్ప -‌ భూపాలపల్లి): వెంకటాపురం(రామప్ప) మండలం పాలంపేట గ్రామానికి చెందిన బోడ సింధుజా ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన కొండబత్తుల రమేష్‌ అనే యువకుడు ప్రేమ పేరుతో సింధుజాను మోసం చేశాడు. దీంతో
మనస్థాపం చెందిన, సింధుజా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

ఇంట్లో విగతజీవిగా పడిఉన్న కూతుర్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కూతుర్ని మోసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ పార్థివ దేహంతో యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. రమేష్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.