2015 బ్యాచ్‌కు చెందిన 14 మంది ఐఏఎస్‌ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్‌ స్కేల్ ఐఏఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి పదోన్నతి అమలులోకి వస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వుల్లో తెలిపారు.

పదోన్నతి పొందిన ఐఏఎస్‌లలో పమేలా సత్పతి, అనురాగ్ జయంతి, గౌతమ్‌ పాత్రు, రాహుల్‌ రాజ్, భవేష్ మిశ్రా, సత్య శారదా దేవి, నారాయణ రెడ్డి, ఎస్ హరీశ్‌, జీ రవి, కే నిఖిల, ఆయేషా మస్రత్‌ ఖానమ్, సంగీత సత్యనారాయణ, యాస్మిన్‌ భాషా, వెంకట్రావ్ ఉన్నారు. ప్రమోషన్లు పొందిన అధికారులు ప్రస్తుతం పని చేస్తున్న చోటు కొనసాగనున్నారు.