దేశానికి కాబోయే ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ అవుతారని , రాష్ట్రానికి కేటిఆర్ ముఖ్యమంత్రి అవుతారని స్థానిక ఎమ్మేల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు . మంగళవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు , ఉపసర్పంచ్లకు సన్మాన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కె . కనకయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు . ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మేల్యే రాజయ్య మాట్లాడుతూ , గెలిచిన సర్పంచ్లు ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని , అలాగే గ్రామంలో ఉన్న చెరువులను గోదావరి నీటితో నింపేందుకు అవసరమైన ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు .

అనంతరం సర్పంచ్ గౌరవ అధ్యక్షులు గాదె ప్రవీణ్ రెడ్డిని సర్పంచ్లు ఎన్నుకున్నారు . అలాగే జఫర్గడ్ మండల కేంద్రంలో సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన తాటికాయల వరుణ్ , వారి కుటుంబ ‘ సభ్యులను ఇంటికి వెళ్లి పరామర్శించారు . ఎలాంటి అధైర్యపడవద్దని తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుజరీ స్వరూప రాజు రైతు సమన్వయ సమితీ మండల కోఆర్డినేటర్ ‘ డారి శంకర్ , మండల ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ అయోధ్య , బుచ్చయ్య , వాంకు డోతు అశోక్ , స్వామినాయక్ , వివిధ గ్రామాల సర్పం చ్లు , ఉపసర్పంచ్లు , టీఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు .