నార్వే దేశానికి చెందిన హెరాల్డ్ బేల్దార్ ఓ పర్యాటకుడు. వివిధ దేశాలు తిరుగుతూ చిన్న చిన్న వీడియోలు తీస్తూ YouTube ‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. ఇటీవల అహ్మదాబాద్‌ను సందర్శించాడు. అక్కడ రోడ్డుపక్కనున్న కటింగ్ షాప్‌కు వెళ్లి కటింగ్ చేసుకున్నాడు. తొందరగా ట్రిమ్ చేయమని చెప్పి, తన యూట్యూబ్ చానల్ కోసం అనుమతి తీసుకొని దాన్ని మొత్తం చిత్రీకరించాడు. ‘ఈ వ్యాపారం గురించి తెలుసుకోవడం చాలా బాగా అనిపించింది. ఈ వ్యాపారం ఎలా సాగుతుంది, రోజుకు ఎంతమంది కస్టమర్లు వస్తారు, అలాగే payment మీద వ్యాపారాన్ని నిర్వహించడానికి ఎవరికైనా డబ్బు చెల్లించాలా?’ అని పలు విషయాలు అడిగి తెలుసుకున్నాడు.

అతడు చేసిన పనికి ఎక్కువ మొత్తం తీసుకుంటాడేమోనని భావించినా ఆ hairdresser ‌ కేవలం రూ.20 మాత్రమే ఇవ్వండని నిజాయతీగా అడిగాడు. దాంతో ఆశ్చర్యపోయిన హెరాల్డ్ ..‘ఇదే అసలు నిజాయతీ. అతడు నన్ను రూ.20 మాత్రమే అడిగాడు. అతడు ఎక్కువ అడిగితే కోపం వచ్చేదేమో..’ అని అన్నాడు. వెంటనే జేబులో నుంచి 400 డాలర్లు తీసి సదరు వ్యాపారికి ఇచ్చాడు. అది మన దేశ కరెన్సీలో రూ.28000. అలాగే ఆ డబ్బుతో ఇంటికి కావాల్సిన ఏదైనా పరికరం కొనుగోలు చేయమని సూచించాడు. హెరాల్డ్ తనపై చూపిన అభిమానానికి అతడికి ఓ కప్పు కాఫీ తాగిచ్చాడు సదరు వ్యాపారి VIDEO ?