ఆడపిల్లను కనిందని భార్యను కొట్టే భర్తలను చూశారు. అయితే తనకు రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టడానికి కారణం భర్తే నంటూ.. అతన్ని చంపేసిన భార్య చరిత్ర ఇది.. మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లా, నలసోపర గ్రామంలో 33 ఏళ్ల మహిళ తన భర్తను కత్తితో పొడిచి చంపేసింది. ప్రణాళీ అనే ఈ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. తనకు రెండవ దఫా కూడా ఆడపిల్ల పుట్టేందుకు భర్తలో వుండే లోపమే కారణమని.. అతని కారణంగా తనకు ఆడపిల్లలు పుట్టారనే కోపంతోనే చంపానని ఒప్పుకుంది. తెల్లవారు జామున భర్త నిద్రపోతుండగా 5గంటల సమయంలో అతడ్ని కత్తితో పొడిచి చంపింది ప్రణాళి. గదిలో రక్తపు మరకలు తుడిచి.. చీర మార్చుకుని..తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని గగ్గోలు పెట్టింది. అయితే పోలీసు విచారణలో నేరం బయటపడింది.