రెండు వంతెనలను కమ్మేసిన పొగ మంచు , ఈ అందమైన ప్రదశాన్ని చుడండి …

పర్యాటకుల తాకిడితో నిత్యం కిటకిటలాడే గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు ప్రాంతాన్ని మంచు కమ్మేసింది. సరస్సుపై ఉన్న రెండు వేలాడేవంతెనలు ఇవాళ ఉదయం 10 గంటలకు మంచు దుప్పటిలో కమ్ముకుపోయాయి. వేకువ జామున ఎలాంటి మంచు లేకుండా ఎండపొడుపుతో ఉన్న ఆ ప్రాంతాన్ని ఒక్కసారిగా పది గంటలకు మంచు కమ్మేసింది. అరుదుగా కనిపించే ఈ దృశ్యం ఆకట్టుకుంటోంది.