ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఒక పెళ్లితో సరిపెట్టుకోవడం లేదు. కొన్నాళ్ల తర్వాత విడాకులు అంటున్నారు. మళ్ళీ కొన్నాళ్ళు సింగిల్ గా ఉండి ఆ తర్వాత రెండో పెళ్లికి రెడీ అవుతున్నారు. అక్కడితో అయినా ఆగితే బాగానే ఉంటుంది కానీ అలా జరుగుతుందనే సందర్భాలు కనిపించడం లేదు. సరే ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. వివరాల్లోకి వెళితే: చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి అటు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మలయాళం, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించింది అంజలి నాయర్. గత ఏడాది వచ్చిన అన్నాతే (తెలుగులో ‘పెద్దన్న’) సినిమాలో సూపర్ స్టార్ రజినీకి తల్లి పాత్రలో కనిపించింది. అయితే హీరో చిన్నప్పుడే చనిపోయినట్టు చూపించారు అనుకోండి ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అంజలి రెండో పెళ్లి చేసుకుంది. ఇటీవల ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. ఆమె తన భర్త, కూతురితో హాస్పిటల్ బెడ్ పై దిగిన ఫోటో వైరల్ గా మారింది. ఇటీవల ఫ్యామిలీతో కలిసి బేబీ బంప్ పిక్స్ ను కూడా షేర్ చేసింది ఈ అమ్మడు. అయితే పెళ్లి చేసుకున్న 5 నెలలకే ఈమె తల్లి అవ్వడం పై సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. అంతకు ముందు ఈమె మలయాళీ ఫిల్మ్ మేకర్ అనీష్ ఉపాసన ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎక్కువ కాలం వీళ్ళు కలిసుండలేదు. ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. ‘5 సుందరికలు’ అనే చిత్రంలో అంజలి కూతురు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వడం కూడా జరిగింది. అటు తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అజిత్ రాజుతో ప్రేమలో పడింది అంజలి. అతన్నే రెండో పెళ్లి చేసుకుంది.