ఈ నెల 10వ తేదీన “సోమవారం” ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరుగు ప్రజావాణి కార్యక్రమానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ హాజరై ప్రజల నుండి వినతులను స్వీకరిస్తారని కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి వెంకట్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు ప్రజావాణి కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆ ప్రకటనలో కోరారు.

శుభాకాంక్షలు తెలియజేసేందుకు:

Advertisement

నూతన జిల్లా కలెక్టర్, మహబూబాబాద్ వి.పి. గౌతమ్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చే ప్రముఖులు, అధికారులు మరియు ప్రజలు శాలువలు, పుష్ప గుచ్చాలు, కేకులు, స్వీట్లు తీసుకొని రావద్దని, వాటికి బదులు కాంపిటీషన్ పరీక్షలకు అవసరమగు పుస్తకాలు, పెన్నులు, నోట్ బుక్స్, డిక్షనరిలు, విజ్ఞనాన్ని అందించే మంచి పుస్తకాలు తీసుకురావాలని, వాటిని గ్రంధాలయాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉంచడం, పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.