ప్రేమికుడుతో కలిసి రైలుకిందపడి ఆత్మహత్య

జగన్నాథపురానికి చెందిన సీహెచ్‌ చంద్రశేఖర్‌ (21), కె.కృష్ణవేణి(19) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతికి ఇటీవలే వేరే యువకుడితో పెళ్లి కుదిరింది. బుధవారం వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె పార్వతీపురంలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. అక్కడకు చేరుకున్నాక కొంత సమయం అనంతరం కృష్ణవేణి కన్పించడం లేదని పెళ్లి కుమారుడు బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో అంతా కలిసి రాత్రి వరకు గాలించారు. అనంతరం విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున. చంద్రశేఖర్‌, కృష్ణవేణిలు రైలు పట్టాలపై విగతజీవులుగా పడిఉన్నట్టు స్థానికులు గుర్తించారు. కాగా, చంద్రశేఖర్‌ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన కానిస్టేబుల్‌ రాతపరీక్ష కూడా రాశాడు. ఆయన తండ్రి చనిపోవడంతో తల్లే కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. యువతి తల్లిదండ్రులూ కూలీలుగా పనిచేస్తున్నారు.

ప్రేమ ఫలించదనే భయంతోనే చంద్రశేఖర్‌, కృష్ణవేణిలు బలవన్మరణానికి పాల్పడి ఉంటారని అంతా భావిస్తున్నారు.