తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి షాక్. వికారాబాద్ ఎస్పీగా మళ్లీ అన్నపూర్ణకే పోస్టింగ్ ఇచ్చింది. దీంతో ఎస్పీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో ఎన్నికల కమిషన్ అధికారుల ఆదేశాలతో వికారాబాద్ SP అన్నపూర్ణపై వేటు వేసిన సంగతి తెలిసిందే. డీజీపీ హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేశారు. అన్నపూర్ణ స్థానంలో అవినాష్ మహంతిని నియమించారు.

అయితే ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో దూకుడుగా వ్యవహరించి బదిలీవేటుకు గురైన అన్నపూర్ణను తిరిగి వికారాబాద్ ఎస్పీగానే నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఆదేశాల ప్రకారం అప్పుడు అన్నపూర్ణపై బదిలీవేటు వేసినప్పటికీ. ప్రభుత్వం కొలువుదీరగానే మరోసారి ఆమెను వికారాబాద్ ఎస్పీగా నియమించడం విశేషం.