హైదరాబాద్ : రైలు కిందపడి గుర్తుతెలియని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎర్నా కథనం ప్రకారం.. గుర్తుతెలియని యువతి(25) సోమవారం సాయంత్రం విద్యానగర్-జామై ఉస్మానియా రైల్వేస్టేషన్‌ల మధ్య హైదరాబాద్-ఫలక్‌నామా ఎంఎంటీఎస్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతురాలి ఒంటిపై ఎరుపు రంగు టీషర్ట్, ఎరుపు రంగు జర్కీన్ ధరించి, ఎత్తు 5.5 ఉన్నట్లు తెలిపారు. మృతురాలి సంబంధీకులు ఎవరైనా ఉంటే ఫోన్: 7780565537, 040-27568355లలో సంప్రదించాలని కోరారు.