రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలంలోని జయగిరి గ్రామానికి చెందిన బింగి నాగరాజు(33) బుధవారం రాత్రి ఇంటి వద్ద కడుపులో నొప్పి వస్తుందని బాధపడుతూ ఇంట్లో భార్యతో ఆస్పత్రికి వెళుతున్నానని చెప్పి చింతగట్టు-మునిపల్లి వద్ద కింద రాత్రి సుమారు 12.30 గంటల సమయంలో రైలు ట్రాక్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతదేహాన్ని విధులు నిర్వహిస్తున్న రైల్వే సిబ్బంది గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలనాకి చేరుకొని మృతుని పక్కనే ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా హసన్‌పర్తి మండలంలోని జయగిరి గ్రామానికి చెందిన యువకుడని నిర్ధారించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.వెంటనే కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతునికి కడుపులో నొప్పి భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.