నవ వధువు ఈ మధ్యనే పెళ్ళి చేసుకుని జీవితంలో స్థిరపడాలనే ఆశతో సుదూర ప్రాంతమైన నేపాల్ నుండి వచ్చి పట్టణంలో స్థిరపడాడానికి భర్తతో పాటుగా వచ్చింది. అన్నారం గ్రామం వద్ద గల మోల్డ్‌టెక్ పరిశ్రమలో కార్మికురాలిగా కుదురుకుంది. విధి వక్రీకరించి ఆమె ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి చనిపోయింది. విషయంలోకి వెలితే స్థానిక ఎస్సై రాజేశ్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం…
నేపాల్ కి చెందిన జానకి భండారి వారి ప్రాంతానికే చెందిన రామ్‌దిస్తాను వివాహమాడి నర్సాపూర్‌లో స్థిరపడ్డారు. ఆమె పనిచేసే పరిశ్రమకు ఉదయం షిఫ్టు డ్యూటీ అవ్వడంతో ఇంటి నుండి 6 గంటలకు బయలుదేరింది. వారు ప్రయాణిస్తున్న ఆటో దోమడుగు గ్రామానికి సమీపంచగానే ప్రధాన రహదరిపై కుక్కలు అడ్డం వచ్చినట్లు అక్కడ గుమిగూడిన ప్రజలు తెలిపారని SI తెలిపారు. దానితో ఆటో పల్టీ కొట్టినట్లు తెలిపారు. దీంతో వెనక నుండి మరో ఆటో ఢీ కొట్టి వెళ్ళినట్లు అక్కడి వారు తెలిపినట్లు ఎస్సై తెలిపారు. ప్రమాద స్థలంలోనే జానకి భండారి చనిపోయినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి గాయాలయ్యాయని తెలిపారు.