రోడ్డు ప్రమాదంలో మెడికో విద్యార్థి రమ్య మృతి, మరో ఇద్దరికీ ..

హైదరాబాద్: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏపీలింగోటం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళుతున్న స్కూటీని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో. కామినేని ఆస్పత్రిలో హౌస్‌సర్జన్లుగా ఆదిలాబాద్‌ జల్లా ఇచ్చోడకు చెందిన సరిపల్లి స్రవంతి (22) హైదరాబాద్‌కు చెందిన రమ్య, నవ్యజ్యోతి పనిచేస్తున్నారు. వీరు ఆస్పత్రి సమీపంలోని ఏపీ లింగోటం వద్ద ఉన్న హోటల్‌లో ఆదివారం టిఫిన్‌ చేసి.. ద్విచక్ర వాహనంపై హాస్టల్‌కు వెళుతున్నారు. వీరి బైక్‌ రోడ్డు మీదకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్రవంతి అక్కడికక్కడే మృతిచెందింది. మరో ఇద్దరు రమ్య, నవ్యజ్యోతి తీవ్రగాయాలపాలయ్యారు. 

తీవ్రంగా గాయపడ్డా వారి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గురైనవారిని కామినేని మెడికల్ కాలేజి విద్యార్థునిలుగా గుర్తించారు.