హైదరాబాద్(మేడ్చల్): మేడిపల్లి పిఎస్ పరిధి బోడుప్పల్ కామన్ వద్ద బైక్ ని ఢీ కొన్న లారీ సంఘటనలో బీటెక్ విద్యార్థిని ముక్కెర అక్షిత(18) అక్కడక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి కి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. మృతురాలు వరంగల్ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతుంది. డీఆర్డిఓ ఎంట్రన్స్ పరీక్ష కొరకు నగరానికి వచ్చి వెల్లేక్రమంలో సంఘటన జరిగింది. మృతురాలి శ్వాసస్థలం పెద్దపల్లి జిల్లా

రాయగిరి మండలం రత్నాపూర్ కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు ముక్కెర సతీష్

కుమార్తె గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి బాడీని గాంధీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.