స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూర్‌ మండలాల్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒకరు దుర్మరణం చెందరు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన నీరటి క్రిస్టోఫర్‌(52) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన శనివారం స్థానిక గాంధీ చౌరస్తా సమీపంలో రహదారిపై నడిచి వెళ్తుండగా హైదరాబాద్‌ నుంచి హన్మకొండకు వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. కిష్టోఫర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

లారీ ఆగకుండా వెళ్లిపోయింది. సంఘటన స్థలంలో మృతుడి భార్య లింగమ్మ, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.