ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా యస్.పి. కుమారి చందన దీప్తి గారు జిల్లా పోలీసు అధికారులతో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేషంలో మెదక్ మరియు తూప్రాన్ సబ్ డివిజన్ డి.యస్.పి., మెదక్ మరియు తూప్రాన్ సబ్ డివిజన్ సి.ఐ.లు మరియు యస్.ఐ.లు పాల్గొన్నారు. ఈ సమావేశం లో యస్.పి. గారు గత నెలలో జరిగిన నేరాల గురించి సిబ్బందిని కూలంకశముగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.పి గారు మాట్లాడుతూ…. శాంతి భద్రతలు, నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు, కేసుల పరిశోధన, పెండింగు కేసులు మొదలైన అంశాలపై సంబందిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల సమీక్షా సమావేశంలో SP గారు పోలీస్ అధికారులకు నేర నివారణ, నేర విచారణకు సంబందించి ముఖ్యమైన సూచనలు చేసారు. అలాగే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో అందరు పోలీస్ అధికారులు, సిబ్బంది ఇతర శాఖల సిబ్భంది సహకారంతో తమ విధులు సక్రమంగా నిర్వహించడం వల్ల ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో పూర్తి చేయగలిగామని జిల్లా SP గారు పోలీస్ అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు.

అదేవిదంగా ప్రతి పోలీస్ అధికారి కింది స్థాయి నుండి పై స్థాయి వరకు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని ప్రజలకు సేవ చేసి మరింత చేరువ కావాలని తెలిపినారు. అదేవిదంగా మొబైల్ పోలీసింగ్ విదానాన్ని అమలు చేయాలని, పోలీస్ వ్యవస్థ సేవలు ప్రజలకు చేరువలో ఉండాలని సిబ్బందికి సూచించారు. అదేవిదంగా పోలీస్ స్టేషన్లో నమోదయిన అన్ని కేసుల వివరాలు CCTNS (The Crime and Criminal Tracking Networks and Systems) లో అప్లోడ్ చేసి పెండింగ్ కేసులను పూర్తి చేయాలని SP గారు సూచించారు. అలాగే డయల్ 100 కు వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని సూచించారు. రాత్రిపూట పెట్రోలింగ్ సమయం లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైజ్ ద్వారా తనికీ చేయాలని సూచించారు. అదేవిధంగా పాత మరియు గత నెలలో జరిగిన కేసుల యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే విచారణలో వున్నా గ్రేవ్ కేసుల యొక్క వివరాలను, ఎస్.సి., ఎస్.టి. కేసుల యొక్క వివరాలు అడిగి తెలుసుకొని విచారణ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే జిల్లా ప్రజలు ట్రాఫిక్ నియమ నిభందనలు పాటిస్తూ పోలిసు వారికి సహకరించాలని కోరినారు. రోడ్డు ప్రమాదాల విషయంలో మూల మలుపులలో , ప్రమాదాలు జరిగే చోట్లలో సూచిక బోర్డ్ ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు.

అలాగే ఈ రోజు సిబ్బందికి హెల్మెట్ లను ప్రదానం చేయడం జరిగింది, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపేలా చూడాలని ఈ సంధర్భముగా అధికారులకు సూచించారు. అదేవిదంగా ఈ పెట్టి కేసులను ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆదేశించినారు. మిస్సింగ్ కేసుల గురించి మాట్లాడుతూ ఏవరైన తప్పిపోయారు అని లేదా కనిపించుటలేదు అని ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఫోటోని అన్ని పోలిస్టేషన్లకు పంపించి మిస్సింగ్ వ్యక్తులను కనిపెట్టడానికి ప్రయత్నం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో పెండింగ్ లో వున్నా నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేయాలని ఆదేశాలు చేసినారు. దొంగతనాల నివారణ గురించి పగలు రాత్రి గట్టి పెట్రొలింగ్ మరియు బీట్లు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేషంలో మెదక్ డి.యస్.పి. శ్రీ. కృష్ణమూర్తి గారు, తూప్రాన్ డి.యస్.పి. శ్రీ. కిరణ్ కుమార్ గారు, జిల్లాలోని సి.ఐ.లు, యస్.ఐ.లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.