ఇది ఓ రౌడీకి, మహిళా కానిస్టేబుల్‌కు మధ్య చిగురించిన ప్రేమ కథ. ప్రస్తుతం వీరి ప్రేమ కథ గురించే నోయిడాలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన రౌడీ షీటర్ రాహుల్‌ థార్సనా పలు హత్య కేసులలో నిందితులు. 2014లో మన్మోహన్‌ గోయల్‌ అనే వ్యాపారిని హత్య చేసిన కేసులో మే 9వ తేదీన అరెస్ట్ అయ్యాడు. ఈ కేసు విచారణలో భాగంగా సూర్జాపూర్‌ కోర్టుకు పోలీసులు అతడిని తీసుకొచ్చేవారు. కోర్టులో విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ పాయల్‌ రాహుల్‌ను చూసి ప్రేమలో పడిపోయింది. ఇలా తరుచూ రాహుల్‌ కోర్టుకు వచ్చినప్పుడల్లా అతనితో పాయల్‌ మాట్లాడుతుండేది. ఇలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రాహుల్‌ బెయిల్‌పై విడుదలైన తర్వాత వారి బంధం మరింతగా బలపడింది. ఐదు సంవత్సరాలుగా వీరి ప్రేమ కథ పెళ్లి పీటలు ఎక్కింది. అయితే వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. పాయల్‌‌ను పెళ్లి చేసుకున్నట్లు రుజువైతే ఆమెపై చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు…