వరంగల్ భూకజ్జాదారుడు రౌడీషీటర్‌ ప్రమోద్‌ కుమార్‌ పై పీడీయాక్ట్‌

-వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. వి.రవీందర్‌

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో భూకజ్జాలు,రౌడీయిజానికి పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న మీల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉర్సు, చెందిన రేణుకుంట్ల ప్రమోద్‌కుమార్‌ పై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ గురువారం పీ.డీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేశారు. పోలీస్‌ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మీల్స్‌కాలనీ ఇన్స్‌స్పెక్టర్‌ పి. దయాకర్‌ వరంగల్‌ కేంద్రకారాగారంలో వున్న నిందితుడుకి జైలర్‌ సమక్షంలో పీ.డీయాక్ట్‌ నిర్బంధ ఉత్తర్వులను అందజేయబడింది.

పీడీ యాక్ట్‌ విధించిన నిందితుడు ప్రమోద్‌కుమార్‌ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోగుండాయిజంతో పాటు భూకజ్జాలు మరియు బెదరింపు వసూళ్ళలకు పాల్పడటం జరుగుతోంది. ఇందులో భాగంగా గత సెప్టెంబర్‌ మాసంలో మీల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక హత్య ప్రయత్నంతో పాటు, బెదిరింపు వసూళ్ళు, రెండు భూకజ్జా నేరాలకు పాల్పడటంతో నిందితుడుని గత నేల 16వ తేదిన మిల్స్‌కాలనీ పోలీసులు అరేస్టు చేసి జైలుకు తరలించడం జరిగింది. నిందితుడు రౌడీయిజం, భూకజ్జాలు తన వృత్తి జీవించేవాడు. తాను చేసే పనులు అడ్డువచ్చిన వ్యక్తులను హత్యచేసేందుకు ప్రయత్నించేవాడు.

అధే విధంగా నగరంలో ఖాళీస్థలాలను భూకజ్జాలకు పాల్పడి సదరు స్థల యజమానినుండి డబ్బు వసూళ్ళ చేయడంతో పాటు, వ్యాపారస్తులను బెదరించి వారినుండి బలవంతపు వసూళ్ళకు పాల్పడేవాడు. ఇదే రీతీలో నిందితుడు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గతంలో 7నేరాలకు పాల్పడ్డాడు. ఇందులో 2002 సంవత్సరంలో మీల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌తో పాటు 2005 సంవత్సరంలో సుబేదారి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో రెండు హత్య కేసుల్లో నిందితుడు కావడంతో పాటు, 2010 ఇంతేజార్‌గంజ్‌, 2011కాజీపేట పోలీస్‌ స్టేషన్ల పరిధిలో హత్యప్రయత్నం కేసులు నమోదు కాగా, మీల్స్‌కాలనీ, కాజీపేట, ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో బెదిరింపు వసూళ్ళతో పాటు, కోట్టిన కేసులు నమోదుకావడంతో నిందితుడిపై పీ.డీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేయడం జరిగిందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ రౌడీయిజం ,చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడటంతోపాటు, భూకజ్జాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు, వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయడం జరుగుతుందని పోలీస్‌ కమిషనర్‌ హెచ్చరించారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయము