జింకల పార్కు వద్దనే వాహనాల పార్కింగ్
– రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లిన పర్యాటకులు:
లక్నవరం పర్యాటక ప్రాంతమంతా శనివారం పర్యాటకులతో కోలాహలంగా మారింది. దసరా సెలవుల్లో భాగంగా శనివారం లక్నవరం పర్యటనకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వేలాదిగా తరలివచ్చారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా మ ధ్యాహ్నం ఒంటిగంటనుంచే పోలీసు లు, అటవీశాఖ అధికారులు వాహ నాలను జింకలపార్కు వద్దనే పా ర్కింగ్ చేయాలని సూచించడంతో పర్యాటకులు పడిన బాధలు అంతాఇంతా కాదు. పార్కింగ్ స్థలం నుంచి రెండు కిలోమీటర్ల మేర నడిచివెళ్లి లక్నవరం అందాలను తిలకించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బోటు షికారు చేసేందుకు గంటలకొద్ది సమ యం నిరీక్షించాల్సి వచ్చింది.
దీంతో అసహనానికి గురైన పర్యాటకులకు లక్నవరం యూనిట్ మేనేజర్ పగిళ్ల కిరణ్, బోటు ఇన్‌చార్జీలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.