ఓరుగల్లు మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ ఆలయంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఐదవ రోజు అమ్మవారు లలిత మహా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి అత్యంత వైభవంగా గంధత్సోవం నిర్వహించారు. సాయంత్రం భద్రకాళీ ఉత్సవ మూర్తికి సాలభంజిక సేవ నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మధ్యాహ్నం మహిళల చేత సామూహిక కుంకుమార్చన జరిగింది.