సర్పంచ్ ఏకగ్రీవమే జయశంకర్ భూపాలపల్లి: గోవిందరావుపేట మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన ననుబోతుల రాజ్ జనగామ జిల్లాకు చెందిన బానోతు లల్లిని గత సంవత్సరం మార్చిలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తండాలు, గూడేలను కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో మొట్టమొదటిసారిగా కోటగడ్డ గ్రామపంచాయతీగా ఏర్పడింది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో కోటగడ్డ గ్రామం ఎస్టీ రిజర్వ్ మహిళగా రిజర్వేషన్ ఖరారైంది.

గ్రామంలో సుమారు 326 ఓట్లు ఉన్నప్పటికీ ఒక్క ఎస్టీ మహిళ కూడా లేదు. దీంతో లల్లీకి అదృష్టం వరిచింది. సర్పంచ్ ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. అతిచిన్న వయసులోనే ఓ గ్రామ సర్పంచ్ బాధ్యతలు స్వీకరించడం ఇక తరువాయి భాగం.