లవర్ కోసం తల్లిని చంపింది

కూతురు పేస్ బుక్ ప్రేమకు తల్లి బలి అయింది. లవర్ తో FB చాటింగ్ ను వద్దన్నందుకు కన్న కూతురు తల్లిని కత్తితో పొడిచి చంపేసింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఏడాదిక్రితం దేవీప్రియ అనే 19 ఏళ్ళ యువతికి ఇన్ స్టాగ్రామ్ లో సురేష్ అనే యువకుడితో పరిచయం కలిగింది. ఇది ప్రేమగా మారి పేస్ బుక్, వాట్సాప్ చాటింగ్ తో ఉన్మాదానికి దారితీసింది. విషయం తెలిసి తల్లి అడ్డుకోవడం , కూతూరు నుంచి మొబైల్ లాగేసుకోవడంతో దేవీప్రియ తల్లిని చంపాలని నిర్ణయించుకుంది. ప్రియుడు సురేష్ తో కుట్ర పన్నింది.

సురేష్ స్నేహితులు ఇద్దరి సాయం తీసుకుంది. వంటిఇంట్లో కత్తితో పొడిచి చంపింది. దేపిడీ కోసం వచ్చిన దొంగలు తల్లిని చంపేశారని నాటకం ఆడింది. అయితే పోలీసు విచారణలో కుట్ర వెల్లడికావడంతో చేసిన నేరాన్ని ఒప్పుకుంది.