పరకాల హనుమకొండ ప్రధాన రహదారిపై కామారెడ్డి పల్లి వద్ద లారీ బస్సు ఢీ 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు. వివరాలు

జయశంకర్‌ జిల్లా భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుమారు 40 ప్రయాణికులతో హన్మకొండ నుంచి భూపాలపల్లికి బయ లుదేరి వెళ్తున్న క్రమంలో, పర కాల మండలంలోని కామారెడ్డి పల్లి గ్రామ సమీపంలో హన్మకొండనుంచి భూపాలపల్లికి వెళ్తున్న లారీ డ్రైవర్‌ అకస్మా త్తుగా బ్రేక్‌లు వేయడంతో ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణి స్తున్న భూపాలపల్లి జిల్లా రే గొండ మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన బొచ్చు కవిత, రేగొండ మండలం కనిపర్తి గ్రామానికి చెందిన శ్రీపతి. మమత, రేగొండకు చెందిన కత్తి. సరిత, రేగొండకు చెందిన మారగాని.
రమ, భూపాలపల్లి జిల్లా ముద్దు నూర్‌కు చెందిన చాగంటి. లావణ్య, చాగంటి అజయ్‌, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన వసంత, జుకల్‌కు చెందిన సంధ్య, భిక్షపతి, పరకాల కు చెందిన సత్యలకు స్వల్ప గాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న ఎస్సై రవీందర్‌ సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 వాహనంలో పరకాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.