లారీ ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన గోవిందరావుపేట మండలం పస్రా సమీపంలో గుండ్లవాగు బ్రిడ్జి సమీపంలో జరిగింది. SI మహేందర్‌కుమార్‌ తెలిపిన వివరాలు, గోవిందరావుపేట మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన సాంబశివరావు గత కొన్నేళ్లుగా పస్రాలో నివాసముంటున్నాడు.

ఆదివారం మద్యాహ్నం మోటర్‌సైకిల్‌పై పస్రా నుంచి తాడ్వాయి వైపు వెళుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

సాంబశివరావు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భార్య, పిల్లలను పరామర్శించి ఓదార్చారు.