ఖమ్మం జిల్లాలో దారుణం: ముదిగొండ మండలం బాణాపురం వల్లబి మధ్యలో దారుణం టూవీలర్ లిఫ్ట్ అడిగిన గుర్తు తెలియని వ్యక్తి, లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై వెనుక నుండి సూది మందు ప్రయోగం సూది ఇచ్చిన వెంటనే విరుచుక పడి చనిపోయిన చింతకాని మండలానికి చెందిన యువకుడు, టూవీలర్ తో పరారైన దుండగుడు. వివరాలు:

మండల పరిధిలోని చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (40) తన బంధువులు ఇంటికి వెళ్తుండగా బాణాపురం- వల్లభి మార్గం మధ్యలో ఓ గుర్తు తెలియని వ్యక్తికి లిఫ్టు ఇచ్చాడు. అయితే, కొంత దూరం వెళ్లిన తర్వాత వెనుక కూర్చున్న వ్యక్తి జమాల్‌పై సూది ముందు ప్రయోగించాడు. దీంతో జమాల్ కళ్లు తిరుగుతున్నాయని బండి ఆపగా, వెనుక కూర్చున్న వ్యక్తి వెంటనే మరో బైక్‌పై పరారయ్యాడు. బండి మీద నుండి కింద పడి ఉన్న జమాల్‌ను వాహనదారులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుర్తు తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇస్తున్నారా తస్మాత్ జాగ్రత్త.