లిఫ్ట్ ఇస్తానని బైక్ పై ఎక్కించుకొని యువతిని

పరిచయస్తుడే కదా లిఫ్ట్ ఇస్తానంటే బైక్ ఎక్కిందో యువతి కానీ కాసేపటికే నిందితుడి అసలు స్వరూపం బయటపడింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన యువకుడు తమ గ్రామానికి వెళుతుండగా, బస్టాప్ లో బస్ కోసం వేచి చూస్తున్న బాధితురాలిపై కన్నుపడింది. వెంటనే ఆమె ముందు బైక్ ఆపి బాధితురాలిని ఇంటి దాకా లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికాడు.

అందుకు యువతి వద్దని వారించినప్పటికీ, ఎలాగైనా తన బైక్ ఎక్కాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో యువతి సరేనని అతడి బైక్ ఎక్కింది. కాస్తా దూరం వెళ్లిన తర్వాత వర్షం పడుతోందని. షార్ట్ కట్‌లో వెళితే ఇంటికి త్వరగా చేరుకోవచ్చని తెలివిగా దారి తప్పించాడు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి బైక్ ను తీసుకెళ్లి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే యువతి తీవ్రంగా ప్రతిఘటించి, అక్కడి నుంచి పారిపోయి, పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here