హైద‌రాబాద్‌: లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన ఓ మేజ‌ర్ జ‌న‌ర‌ల్‌కు ఇండియ‌న్ ఆర్మీ భారీ శిక్ష‌ను ఖ‌రారు చేసింది. అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఆ మేజ‌ర్‌ను ఉద్యోగ విధుల నుంచి డిస్మిస్ చేశారు. పెన్ష‌న్ లేకుండానే అత‌న్ని విధుల నుంచి తొల‌గించిన‌ట్లు తెలిసింది. సైనిక కోర్టులో జ‌రిగిన విచార‌ణ‌కు సంబంధించిన అంశాన్ని ఇవాళ ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ తెలిపారు. ఈ కేసులో గ‌త జూలైలోనే నిర్ణ‌యం వెలువడిన‌ట్లు తేలింది. 2016లో చాందీమందిర్‌లో లైంగిక వేధింపుల ఘ‌ట‌న జ‌రిగింది. కెప్టెన్ ర్యాంక్ ఉన్న ఓ మ‌హిళా ఆఫీస‌ర్‌ను మేజ‌ర్ వేధించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.