పైన ఫొటోలో కనిపిస్తున్నయువతి పేరు వాసవి. వయసు 26ఏళ్లు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో లోకో పైలట్ గా విధులు నిర్వర్తిస్తుంది. ఈ యువతి సనత్ నగర్ లోని ఓ గదిలో అద్దెకు ఉంటూ ఉద్యోగానికి వెళ్లేది. ఇదిలా ఉంటే వాసవి నవంబర్ 30న సాయంత్రం షాపింగ్ కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. ఇక రాత్రి 9, 10 గంటలు అయినా రూమ్ కు రాలేదు. దీంతో వాసవి తండ్రి కూతురు వాసవికి అనేక సార్లు ఫోన్ చేశాడు. కానీ ఎంతకు కూడా ఆ యువతి స్పందించలేదు. దీంతో వెంటనే ఆ యువతి తండ్రి కూతురు అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. ఇక వెంటనే ఆ ఇంటి ఓనర్ ఆ యువతి ఇంట్లోకి వెళ్లి చూడగా రూమ్ లో ఫోన్ మాత్రమే ఉందని, వాసవి లేదని ఆ యువతి తండ్రికి చెప్పాడు. దీంతో ఖంగారుపడ్డ ఆమె తండ్రి, కుటుంబ సభ్యులు సనత్ నగర్, సికింద్రాబాద్ ఏరియాలో వెతికారు. ఎంత వెతికిన వాసవి జాడ మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక ఆ యువతి తండ్రి సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆ యువతి తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ఇన్ని గడిచినా పోలీసుల కూడా ఆ యువతి జాడ తెలియలేదు. అయితే ఈ యువతి మిస్సై 50రోజులు గడుస్తున్న పోలీసులకు, తల్లిదండ్రులకు ఎలాంటి ఆచూకి దొరకలేదు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే కనిపించకుండపోయిన యువతి ఎత్తు 5.5 అడుగులు ఉంటుందని, తెలుగు, ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడగలదు. ఎవరికైనా కనిపిస్తే 9490617132, 8919558998 నంబర్లకు సమాచారం ఇవ్వాగలరని పోలీసులు కోరారు.