తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. వారే సినీనటి సుమలత, నవనీత్‌ కౌర్‌ , రవికిషన్‌! గోరఖ్‌పూర్‌లో రవికిషన్‌ రేసు గుర్రం చిత్రంలో విలన్‌గా నటించిన రవికిషన్‌ యూపీలో కీలక నియోజకవర్గమైన గోరఖ్‌లోపూర్‌లో 3 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇక్కడి నుంచి ఐదు సార్లు విజయం సాధించారు. భోజ్‌పురీ, బాలీవుడ్‌తో పాటు తెలుగు సినిమాల్లోనూ నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి యోగి ఆదిత్యనాథ్‌ సహకారంతో బీజేపీ తరఫున భారీ విజయాన్ని నమోదు చేశారు. కన్నడనాట సుమలత శ్రుతిలయలు, ఖైదీ, గ్యాంగ్‌లీడర్‌ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన సుమలత తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించిన ఆమె.. కన్నడ స్టార్‌ అంబరీశ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే గత ఏడాది ఆయన చనిపోవడంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు, సినీనటుడు నిఖిల్‌పై స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి మట్టి కరిపించారు.

మహారాష్ట్రలో కౌర్‌ యమదొంగ, శ్రీను వాసంతి లక్ష్మీ, మహారథి వంటి చిత్రాల్లో నటించిన నవనీత్‌ కౌర్‌ తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ నియోజకర్గంలో శివసేన సిటింగ్‌ ఎంపీ ఆనంద్‌రావ్‌పై యువ స్వాభిమానీ పక్ష తరఫున పోటీ చేసిన కౌర్‌ 30 వేల మెజారిటీతో గెలిచారు. బాలీవుడ్‌లోనూ అద్భుత నటనతో అలరించిన ఆమె మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణాను పెళ్లి చేసుకున్నారు. భర్త అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె.. ఎంపీగా గెలుపొందారు.