వడ్డేపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేస్తామని గ్రేటర్ కమిషనర్ రవికిరణ్ అన్నారు. ఈ మేరకు వడ్డేపల్లి చెరువు బండ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రకాళి బండ్ తరహాలో వడ్డేపల్లి చెరువు బండ్‌ను అభివృద్ధ్ది చేస్తామన్నారు. అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. బండ్‌పై ఆహ్లాదకర వాతవరణం కల్పిస్తామన్నారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయ ఎదుట ఉన్న పార్కు స్థలాన్ని పరిశీలించారు. స్థల విషయం కోర్టు వివాదం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోతన నగర్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో ప్లాట్‌ఫాం మరమ్మతులు పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.