{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581146772221","total_editor_time":0,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581146736616","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

తెలంగాణలో ఐటీ కంపెనీల విస్తరణ మొదలైంది. హైదరాబాద్ తరువాత ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను విస్తరించనున్నట్టు గతంలో ప్రభుత్వం తెలిపిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా మడికొండ, ఐటీ పార్క్‌లో సైయెంట్‌, టెక్‌ మహీంద్రా క్యాంపస్‌లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ గత నెలలో ప్రారంభించారు.

Advertisement

తాజాగా మరో ఐటీ కంపెనీ వరంగల్‌లో కొలువుదీరనునట్టు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రముఖ పారిశ్రామిక, నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ, తమ అనుబంధ సంస్థ మైండ్ ట్రీ ఐటీ కేంద్రాన్ని వరంగల్ నగరంలో ఏర్పాటు చేయనుందని మంత్రి కేటీఆర్ శుక్రవారం ట్విటర్‌లో వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోరైలు మూడో కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఎల్ అండ్ టీ సీఈవో, ఎండీ సుబ్రమణ్యన్ వరంగల్‌లో మైండ్ ట్రీ కేంద్రం ఏర్పాటుకు అంగీకారం తెలిపారని ఆయన వెల్లడించారు.