వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను మామునూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి ట్విట్టర్‌లో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టింగ్‌లు పెట్టాడు. ఈ విషయంపై వరంగల్‌ నగరంలో చర్చ జరుగుతుంది. కూడా మాస్టర్‌ ప్లాన్‌ సామాజిక మాధ్యమాలలో రావడంతో దానిని చూపిస్తూ ట్విట్టర్‌లో కలెక్టర్‌తో పాటు మరికొంతమంది అధికారులను దూషిస్తూ పోస్టింగ్‌లు పంపించాడు. దీనిపై కలెక్టర్‌తో, ఇతర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్‌ సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ పి.సదయ్యను వివరణ కోరగా ఫిర్యాదు వచ్చిందని, కేసు నమోదు చేసి నిందితుడి గురించి గాలిస్తున్నామన్నారు.