{"source":"share_action_sheet","effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578277892763","total_editor_time":207,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578277875508","total_effects_time":0,"brushes_used":0,"height":1548,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

తెలంగాణలో వరంగల్‌ ఇక ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కేంద్రంగా మారిపోనుంది. హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో రెండో ఐటీ నగరంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ ఐటీ కంపెనీలైన టెక్‌ మహీంద్రా, సైయెంట్‌ సంస్థలు తమ కేంద్రాలను వరంగల్‌లో ప్రారంభించేందుకు రెడీ అయ్యాయి. వరంగల్‌ సమీపంలోని మడికొండలో టీఎస్ఐఐసీ అభివృద్ది చేసిన ఐటీ సెజ్‌లో ఈ కేంద్రాలను నెలకొల్పారు.

2016 ఫిబ్రవరిలో సైయెంట్‌, 2018 జనవరిలో టెక్‌ మహీంద్రా ఈ కేంద్రాలకు శంకుస్థాపన చేయగా, ఈ నెల 7న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. వరంగల్‌లో ఈ కేంద్రాలను ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని కేటీఆర్‌ ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొనటమే కాకుండా అక్కడి చిత్రాలను షేర్‌ చేశారు. 1000 ఉద్యోగాలు! హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సైయెంట్‌ ఇప్పటికే వరంగల్‌లో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను నిర్వహిస్తోంది.

ప్రస్తుతం ఈ సెంటర్‌లో 200 మంది వరకు సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. కాగా విస్తరణలో భాగంగా ఐదెకరాల విస్తీర్ణంలో సైయెంట్‌ సొంతంగా టెక్నాలజీ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను సిద్ధం చేసుకుంది. దీన్ని రేపు మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. టెక్నాలజీ సెంటర్‌ ద్వారా అదనంగా మరో 600 నుంచి 800 మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఇప్పటి వరకు సైయెంట్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రంగా ఉన్న భవనాన్ని టెక్‌ మహీంద్రాకు అప్పగించారు. టెక్‌ మహీంద్రా ద్వారా 200 మంది సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.