వరంగల్‌ : డ్రైవర్‌ నిర్లక్ష్యంతో చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ 28 మందికి

వరంగల్‌

హైదరాబాద్‌ నుంచి నర్సంపేటకు వెళ్తున్న పరకాల డిపో కు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్‌ సాంబయ్య నిద్రమత్తులో బస్సును నడపడంతో అదుపుతప్పి జనగామ సమీపంలో ఓ చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 28 మందికి గాయాలు కాగా..వారిలో 14 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షత గాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.F