{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582859150209","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582859127657","source":"other","origin":"unknown"}

22వ డివిజన్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో బాగంగా మంత్రి సత్యవతి రాథోడ్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, ఎంపి పసునూరి దయాకర్ లతో కలిసి కాశికుంట, గొల్లవాడ, కాపువాడ తో పాటు పలు వీదులను సందర్శించారు, వార్డులో కలియదిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు, మురికి కాలువలు, రోడ్లు, కరెంట్ పోల్స్, స్మశానవాటిక స్థలాలను పరీశిలించారు..

పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయున్నాయి:

ఎప్పుడో ప్రారంభమైన అభివృద్ధి పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయున్నాయి. ఎక్కడ చూసినా శిలాఫలకాలే కనిపిస్తున్నాయి. ఒక్క పని కూడా పూర్తికాలేదు. ఇక కొత్త సమస్యలు మీరేం తీరుస్తారు. ముందు, ఆగిపోయిన పనులు పూర్తిచేసి తర్వాత రండి’’. ఇదీ, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులకు, అధికారులకు ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన.

వరంగల్‌ తూర్పు నియోజకవర్గం 22వ డివిజన్లో పట్టణ ప్రగతిలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్‌కు నిరసన సెగ తగిలింది. తమ ప్రాంతంలో దీర్ఘకాలికంగా పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయని, కొత్తవాటి విషయం పక్కనపెట్టి ముందు వాటిని పరిష్కరించాలని కోరారు. రోడ్లు, డ్రైనేజీల దుస్థితిని వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, తాను ఓట్ల కోసం రాలేదని అభివృద్ధి చేయడానికి వచ్చానని చెప్పారు. డ్రైనేజీని పరిశీలించిన మంత్రి అధికారులపై మండిపడ్డారు. కడిపికొండ పట్టణ ప్రగతిలో పాల్గొనేందుకు వచ్చిన అధికారులు, స్థానికుల ఆగ్రహానికి గురయ్యారు. గతంలో శంకుస్థాపన జరిగిన పనులకు నేటికీ మోక్షం లేదని, ఏ ముఖం పెట్టుకుని మళ్లీ వచ్చారని నిలదీశారు.