నాటు తుపాకీని కలిగియున్న యువకుడిని మంగళవారం సి.సి.ఎస్‌ అరెస్టు చేసారు. నిందితుడు నుండి ఒక నాటు తుపాకితో పాటు నాలుగు తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ క్రైమ్స్‌ అదనపు డి.సి.పి బిల్లా అశోక్‌కుమార్‌ వివరాలను వెల్లడిస్తూ, గీసుగొండ మండలం, ధర్మారం గ్రామములో నివసించే గట్టికోప్పుల సచిన్‌ టెండూల్కర్‌ రంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామ శివారు ప్రాంతంలో ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాలలో బి.టెక్‌ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. నిందితుడు కాలేజీకి పోయి, వస్తున్న క్రమములో 6మాసాల క్రితం హైదరాబాద్‌ నివాసి సల్మాన్‌ నిందితుడు సచిన్‌ టెండూల్కర్‌తో పరిచయం కావడంతో నిందితుడు సల్మాన్‌ కల్సితో కల్సి తిరగడంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. తర్వాత సల్మాన్‌ తనకు కొన్ని సమస్యలు వున్నాయని, తనకు ప్రాణ భయం వుందని కావున, మీది వరంగల్‌ జిల్లా కాబట్టి వరంగల్‌ నందు నీకు ఎవరైనా తెలిసిన వారు వుంటే వారి ద్వారా ఒక తుపాకి కోనుగోలు చేసి ఇస్తే ఒక లక్ష రూపాయలు ఇస్తానని. నిందితుడుతో సల్మాన్‌ తెలపడంతో, డబ్బుపై ఆశపడిన నిందితుడు ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని కాండ్వ జిల్లాలో తుపాకులు అమ్ముతారని తెలుసుకోని తల్లిదండ్రులు తన వ్యక్తిగత ఖర్చుల గురించి ఇచ్చే డబ్బును జమచేసాడు.

నిందితుడు జమచేసిన డబ్బును తీసుకోని కాలేజీ సెలవుల సమయంలో నిందితుడు ఎవరికి తెలియకుండా ఒంటరిగా ఉత్తరప్రదేశ్‌లోని కాండ్వ జిల్లాకు వెళ్ళి 40వేల రూపాయలతో ఒక నాటు తుపాకి, నాలుగు తూటాలను కోనుగోలు చేశాడు. కోనుగోలు చేసిన తుపాకిని నిందితుడు ధర్మారంలోని తన ఇంటిలో రహస్యప్రదేశంలో భద్రపర్చి తిరిగి కాలేజీకి వెళ్ళిపోయినాడు. నిందితుడు కోద్దిరోజులు వరకు చదువుకుంటునే సదరు సల్మాన్ కలవకపోవడంతో నిందితుడు సంక్రాంతి పండుగ కోసం నెల 13వ తేదిన తన ఇంటివచ్చాడు.

సంక్రాంతి పండుగ సెలవులు పూర్తి కావడం నిందితుడు తన వద్ద వున్న తుపాకిని అమ్మేందుకుగాను తన ఇంటిలో రహస్యంగా భద్రపరిచిన తుపాకిని తన కాలేజీ బ్యాగ్‌లో భద్రపర్చుకోని. ఈ రోజు ఉదయం సమయంలో తన స్వగ్రామమైన ధర్మారం నుండి హైదరాబాద్‌ వెళ్ళేందుకు గాను ఆర్టీస్‌ బస్‌ కోసం నర్సంపేట-వరంగల్‌ ప్రధాన మార్గం నుండి నిందితుడు నడుచుకుంటూ వెళ్ళుతుండగా, సమాచారం మేరకు క్రైమ్‌ అదనపు డి.సి.పి బిల్లా ఆశోక్‌కుమార్‌ అదేశాలతో సి.సి.ఎస్‌ ఇన్స్‌స్పెక్టర్‌ డేవిడ్‌రాజు తన సిబ్బందితో పాటు గీసుగొండ పోలీసులతో కల్సి ధర్మారంలో సుధాకర్‌ వైన్స్‌ ప్రాంతంలో పోలీసులు తనీఖీలు నిర్వహిస్తుండగా ఇది గమనించిన నిందితుడు భయపడి అక్కడ నుండి పరిగేత్తుతుండగా చూసిన పోలీసులు నిందితుడుని పటుకొని తనిఖీ చేయడగా, నిందితుడి బ్యాగ్‌లో తుపాకిని, నాలుగు తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడుని పట్టుకోని తుపాకిని స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరచిన క్రైమ్స్‌ అదనపు డి.సి.పి అశోక్‌కుమార్‌, సి.సి.ఎస్‌ ఇన్స్‌స్పెక్టర్లు డేవిడ్‌రాజు, రవిరాజు, గీసుగొండ ఇన్స్‌స్పెక్టర్‌ సంజీవరావ్‌, ఎస్‌.ఐ యం.డి అబ్దుల్‌ రహీమ్‌, సి.సి.ఎస్‌ హెడ్‌ కానిస్టేబుళ్‌ రవికుమార్‌, షేక్‌మహమ్మద్‌ ఆలీ, రాజశేఖర్‌, చంద్రశేఖర్‌లను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌ అభినందించారు.