వరంగల్: ప్రేమికుడి కోసం సెల్ టవర్ ఎక్కి నిరసనను వ్యక్తం చేస్తోంది ఓ యువతి. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు, టవర్ ఎక్కింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి నక్క మోష అనే యువకుడు మోసం చేసాడని తనకు న్యాయం చేయకపోతే టవర్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తు మాలిక అనే యువతి ఆందోళన చేపట్టింది. దీంతో మాలిక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ పెగడపెళ్లిలో చోటుచేసుకుంది.
తొమ్మిది సంవత్సరాలుగా తనను ప్రేమిస్తున్నాని చెప్పిన మోషేకు ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిదనీ, అప్పటి నుంచి తనను దూరం పెట్టి ఇప్పుడు వేరే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ ఫిక్స్ చేసుకున్నాడనీ తెలిపింది. తనకు న్యాయం చేయమని గ్రామ పెద్దలను అడిగినా ఫలితం లేకుండా పోయిందనీ ఆమె వాపోయింది. ఈ క్రమంలో సెల్ టవర్ ఎక్కి పైనే ఉన్న మాలికతో అంకడి వారు కూడా మాట్లాడారు. కిందకు దిగిరమ్మని మాలికను కన్విన్స్ చేసేందుకు యత్నించారు. అయినా వినకపోవటంతో స్థానిక పోలీసులకు సమచారం అందించింది. దీంతో ఘటనస్థలికి చేరుకున్న ఎస్సై హరికృష్ణ మాలికను కన్విన్స్ చేసేందుకు యత్నిచ్చారు…

Advertisement

అనంతరం వారి సమాచారం మేరకు యువకుడితో పాటు వారి కుటుంబ సభ్యులను సెల్ టవర్ వద్దకు పిలిపించారు. వారిని చూపించి యువతిని కిందకు దించారు. ఆ తరువాత యువతి, యువకుడితో పాటు వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. చివరకు మౌనికను పెళ్లి చేసుకునేందుకు నక్క మోసే అంగీకరించడంతో పిఎస్ లోనే వారి వివాహం జరిపించారు.