శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా చిత్రంలో తెలంగాణ అమ్మాయి పాత్రలో నటించి అందరిని ఫిదా చేసింది సాయిపల్లవి . ప్రస్తుతం ఈ అమ్మడు వేణు ఉడుగల దర్శకత్వంలో విరాట పర్వం అనే , చిత్రం చేస్తుంది . రానా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు . ఇప్పటికే చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా , సాయి పల్లవి టీంతో ఇటీవల కలిసింది . తాజా సమాచారం ప్రకారం సాయి పల్లవి విరాట పర్వం చిత్రంలో వరంగల్ అమ్మాయిగా కనిపించి సందడి చేయనుందట . నక్సలిజం నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం ఉండనుందని అంటున్నారు . ఫోక్ సింగర్ గా సాయి పల్లవి ఆకట్టుకుంటుందని చెబుతున్నారు . ప్రస్తుతం రానాకి కిడ్నీ ట్రీట్ మెంట్ జరుగుతుండగా , అది పూర్తైన తర్వాత అక్టోబర్ లో సాయి పల్లవి , రానా మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది బాలీవుడ్ నటుడు నానా పటేకర్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడట . అలానే టబు పాత్ర కూడా కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుందట .