వరంగల్: అర్బన్ జిల్లాలోని ఆకేరు వాగుతోపాటు చెరువులు, కుంటలు నిండి పొంగి పొర్లుతున్నాయి. ఘన్‌పూర్, జనగామ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆకేరు ఉధృతికి దిగువ ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. దీంతో చెరువులు, కుంటల్లోకి నీటిని మళ్లిస్తున్నారు. రాష్ట్రం లోని వివిధ జిల్లాలోని పరిస్థతి, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అదిలాబద్ లో షేక్‌గూడ వాగు ఉప్పొంగింది. వరద ధాటికి ఓ ప్రైవేటు జీపు వరదల్లో చిక్కుకుంది. వాగులోకి కొంతదూరం వెళ్లిన తర్వాత బండరాయి తాకడంతో జీపు నిలిచిపోయింది. జీపులోంచి డ్రైవర్ దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఇక అతి కష్టంమీద పోలీసులు తాడు సహాయంతో జీపులో ఉన్న ప్రయాణీకులను ఒడ్డుకు చేర్చారు. జేసీబీ సహాయంతో జీపును ఓడ్డుకు చేర్చారు.