పెళ్లిని ఆపిన సెల్ఫీ ఆపిన సెల్ఫీ

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం సురారం గ్రామం , పెళ్లిని ఆపిన సెల్ఫీ, వరుడి whatsup ఫేస్బుక్ లకు ఫోటోలు పంపిన ప్రియుడు తాను వధువు ప్రియుడినంటూ ఫోన్ పెళ్లికి నిరాకరించిన వరుడు.

వివరాలు : మంచిర్యాల  ‌కు చెందిన అనిల్ కుమార్‌కి వరంగల్ జిల్లా సూరారం గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. వీరిద్దరి వివాహం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని బీఎస్‌ఆర్ గార్డెన్‌లో జరపడానికి పెద్దలు ఏర్పాట్లు చేశారు. ఆదివారం (జులై 1న) ముహూర్తం నిర్ణయించారు. అనుకున్న ప్రకారం పెళ్లి జరుగుతుండడంతో అంతా ఆనందంతో ఉన్నారు. ఫంక్షన్ హాల్ అంతా బంధువులు, స్నేహితులతో కళకళలాడుతోంది. వధువు, వరుడు పెళ్లిపీటల మీద కూర్చున్నారు. పురోహితుడు వేద మంత్రాలు చదువుతూ పెళ్లి తంతు జరిపిస్తున్నాడు.
ఇంతలో వరుడి సెల్‌‌కి కొన్ని ఫొటోలు వచ్చాయి. ఆ ఫొటోల్లో తాను తాళి కట్టబోయే అమ్మాయి మరొకరితో కలిసి దిగిన ఫొటో ఉంది. అవి చూస్తుండగానే ఫొటోలో ఉన్న వ్యక్తి ఫోన్ చేసి నువ్వు చేసుకోబోయే అమ్మాయిని నేను ప్రేమించాను. మేము ఇద్దరం కలిసి ఓ సూపర్ మార్కెట్లో పనిచేశాము. అప్పటినుంచి ప్రేమించుకుంటున్నాము అని తెలిపాడు. విషయం విన్న వరుడు ఖంగుతిని తాళి కట్టను పొమ్మన్నాడు. పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో ఒకేచోట పనిచేస్తున్నప్పుడు సరదాగా దిగిన సెల్ఫీ అది అని అమ్మాయి ఎంత చెప్పినా వినిపించుకోలేదు.

తనని మోసం చేశారంటూ వధువు, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు అనిల్ కుమార్. వధువు కూడా తన కొలీగ్‌ ప్రశాంతపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పెళ్లి ఆగిపోవడానికి కారణమైన వ్యక్తిని శిక్షించమంటూ పోలీసులను కోరింది.