మానస తల్లి గాదం స్వరూప ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

పట్టణంలోని బాలసముద్రంలో గల ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్మృతి వనం వద్ద 8 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో స్వరూప 9వ రోజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నవంబర్‌ 27న పుట్టిన రోజు సందర్భంగా గుడికి వెళ్లిన మానస అత్యాచారం, హత్యకు గురైన విషయం విదితమే. అనంతరం హైదరాబాద్‌లో దిశ ఘటన చోటుచేసుకుంది.

అయితే ! దిశకు జరిగిన న్యాయం తన కూతురు విషయంలో జరగడం లేదని స్వరూప ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి 18 రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదంటూ సర్కారు తీరుపై ఆమె మండిపడ్డారు. న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దీక్షాస్థలికి చేరుకున్న దాస్యం వినయ్ భాస్కర్‌ ప్రభుత్వం తరపున పూర్తి భరోసా ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా తక్షణ న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పారు…