ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

నర్సంపేట పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్ ఐ నాగనాథ్ తెలిపారు. నర్సంపేట ఎస్సై కథనం ప్రకారం నర్సంపేట పట్టణం లోని హనుమాన్ దేవాల్ పాఠశాల ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్నారు. పక్కా సమాచారం మేరకు దాడులు చేయగా ఆరుగురు పట్టుకోవడం జరిగింది అని , మరికొందరు పారిపోయారు అన్నారు.

వారి నుంచి 3,700 అన్నగారు లభ్యమైంది. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.