వరంగల్ నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అధికారులు ప్రైవేట్‌ వ్యక్తులను డ్రైవర్లుగా నియమించి బస్సులను నడిపిస్తున్నారు.

అదే క్రమంలో ప్రైవేట్‌ వ్యక్తిని డ్రైవర్‌గా తీసుకొని ఆర్టీసీ బస్సు అప్పగించారు. ఆరుగురు ప్రయాణికులతో వరంగల్‌కి వెళ్తున్న క్రమంలో పట్టణ శివారులోని రోడ్డు పక్కనున్న చెట్టుని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాములు అనే వ్యక్తికి చేయి విరిగింది. మరో ప్రయాణికురాలు కొమురమ్మకు స్వల్ప గాయమైంది.

సంఘటనా స్థలాన్ని సీఐ కరుణ సాగర్‌రెడ్డి, నర్సంపేట ఆర్టీసీ డీఎం సుందర్‌ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షత్రగాత్రులను స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.