ఇక్కడ వైద్యం పూర్తిగా ఉచితం
వరంగల్ నగరం, మట్టెవాడ ప్రాంతంలో ఉన్న తన ఇంటినే వైద్యశాలగా మార్చి ఉచిత వైద్యం అందిస్తున్నారు నగరానికి చెందిన డాక్టర్ పాములపర్తి రామారావు.
నగరంలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వైస్ప్రిన్సిపల్గా పనిచేసి గతేడాది పదవీ విరమణ పొందిన రామారావు ప్రస్తుతం పూర్తి సమయం వైద్య సేవలు అందించేందుకు కేటాయిస్తున్నారు.
దీర్ఘకాలికంగా పీడించే వెన్నునొప్పి, నడుంనొప్పి, మోకాళ్లనొప్పి, కీళ్లనొప్పులతోపాటు తలనొప్పి, ఉదర సంబంధిత వ్యాధులు, దృష్టి లోపాలతో వచ్చేవారూ దగ్గు, ఆయాసం, అలర్జీ, జ్వరాలతో వచ్చేవారూ రామారావు అందించే ఆయుర్వేద వైద్యంతో ఉపశమనం పొందుతున్నారు. రామారావు (ఫోన్:9440514999).