ఎట్టి పరిస్థితుల్లోనూ వరంగల్ ఎంపీ స్థానంలో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వరంగల్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే జిల్లాలోని నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ కేసీఆర్ ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సానుకూల ఫలితాలు రావడంతో త్వరలో జరుగబోవు పార్లమెంటు ఎన్నికల్లో ఫలితాలను అనుకూలంగా మార్చుకోవాలన్న ఆశయంతో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు టీఆర్‌ఎస్‌లోని ముఖ్య నాయకులే వెల్లడిస్తున్న విషయం తెలిసిందే.
వరంగల్ జిల్లాలో ఎంపీ సీటును దక్కించుకోవాలంటే సరైన అభ్యర్థి ఎవరనే అంశంపై సీఎం ప్రత్యేకంగా సర్వేచేపట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ స్థానాల్లో ఒకటి ఎంఐఎంకు కేటాయిస్తే మిగిలిన 16 స్థానాల్లోనూ గెలుపొందాలని సీఎం పదేపదే ముఖ్యనేతలకు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం నాలుగైదు ఎంపీ స్థానాలు మినహా మరెక్కడా ఎవరికి సీటు ఇస్తారో మాత్రం చెప్పడంలేదు. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో ఉన్నవారిని మార్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో వరంగల్, నల్లగొండతో పాటు మరో మూడు జిల్లాల్లో కేసీఆర్‌ను పోటీచేసేందుకు స్థానిక నేతలు ఆహ్వానిస్తున్నట్టు వినికిడి.
ప్రత్యర్థిని బట్టి అభ్యర్థి ప్రకటన..?
వరంగల్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ లేదా, మహాకూటమి తరఫున పోటీలో ఉండే అభ్యర్థి ఎవరనే అంశాన్ని బట్టి టీఆర్‌ఎస్ తన అభ్యర్థిని ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తరఫున ఏకంగా MRPS అధ్యక్ష్యులు మంద కృష్ణ మాదిగ లేదా, మాజీ మంత్రి గుండె విజయరామారావు పోటీలో ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా అధికార పార్టీలో పోటీదారుల సంఖ్య ఎక్కువగానే ఉంది కడియం కావ్య కోసం కడియం శ్రీహరి గారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు , ప్రస్తుత ఎంపీ పసునూరి దయాకర్ కూడ తనకే అవకాశం వస్తుందిని దీమాతో ఉన్నాడు. ఇవ్వన్నీ ఒకఎత్తు ఐతే ఇప్పుడు ఇంకోక కొత్త పేరు బయటికి వస్తుంది, అదికూడా ప్రస్తుత గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్.

టికెట్ కోసం దాస్యం వినయ్ భాస్కర్ గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కార్పొరేటర్ బోడ డిన్న పేరును పరిశీలంచాలని అధిష్టానం ముందు పెట్టారు. దీనితో ఆశావహుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండటంతో టికెట్ ఎవరికీ కేటాయిస్తారు అనే ఉత్కంఠ ఏర్పడింది… బోడడిన్న జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక పేరు ఏర్పాటు చేసుకున్నారు. సామజిక సేవలో ముందుంటారు , సమస్యలు సైతం మాముందు ఉంది పరిష్కరిస్తారు అలంటి నాయకుడు మా కార్పొరేటర్ ఎంపీగా అవకాశం ఇస్తే బాగుంటుంది అని డివిజన్ ప్రజలు పేర్కొంటున్నారు. వీటన్నిటికీ తోడు దాస్యం అండదండలు పుష్కలంగ ఉండటంతో టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని జిల్లా నేతలు కొత్త చేర్చ మొదలు పెట్టారు.. చూడాలి రాబోయే రెండు మూడు రోజుల్లో అభ్యర్థి ఎవరనేది తేలుతుంది!