జనగామ: జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. జనగామ ఎస్సై శ్రీనివాస్‌ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనివాస్‌ భార్య స్వరూప(45) ఈ ఉదయం ఉరి వేసుకుని చనిపోయారు. అది చూసి శ్రీనివాస్‌ కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే భార్య చనిపోయిందన్న మనస్థాపంతో కాసేపటికే శ్రీనివాస్‌ సైతం సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యలకు కారణమని తెలుస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..