ఆర్థిక ఇబ్బందుల తో ఐనవోలులో ఆత్మహత్య
చేసుకున్న ఆటోడ్రైవర్ రాజు. సుసైడ్ నోట్ కుటుంబ సభ్యులు, మిత్రులు, తోటి ఆటోడ్రైవర్లకు కన్నీళ్లు తెప్పించింది. లేఖలో రాజు పేర్కొన్న ప్రకారం. ఎవరి మనుసునైనా బాధపెడితే క్షమించండి. నా భార్య, నా బిడ్డలు, వదినలు, బతుకమ్మ పండుగను సంతోషంగా గడపండి. చిన్న బాబాయి, చెల్లెలు, అన్నయ్యలు నన్ను క్షమించండి, ఆల్ మై ఫ్రెండ్స్, పదో తరగతి(2003-04) బ్యాచ్ రుణం తీర్చుకోలేను. రెండుసార్లు గెట్ టు గెదర్ జరుపుకున్నాం. మూడోసారి మిస్సవుతున్నందుకు సారీ. దయచేసి నా శవానికి పోస్టుమార్టం చేయకండి, ఆటో కార్మికులారా. ఎవరినైనా బాధ కలిగిస్తే క్షమించండి ఇక నుంచి ఈ డ్రైవర్ దొంతూరి రాజు లేడు సారీ’’ అని రాశాడు.
కాకతీయ ఆటో యూనియన్ సభ్యుడైన. రాజు భౌతికకాయాన్ని యూనియన్ నాయకులు, సభ్యులు సందర్శించి నివా ళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. యూనియన్ నుంచి రూ.10వేల ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. యూనియన్ అధ్యక్షుడు చింత అశోక్, గాదె అనిల్, బుర్ర సతీష్, కల్‌నాయక్, రాజ్‌కుమార్, జాన్సన్ పాల్గొన్నారు.